నగరంలో రౌడీ మూకల హల్ చల్.. పోలీసులపై దాడికి యత్నం

Published : Jun 29, 2019, 08:15 AM IST
నగరంలో రౌడీ మూకల హల్ చల్.. పోలీసులపై దాడికి యత్నం

సారాంశం

హైదరాబాద్ నగరంలో రౌడీ మూకలు బీభత్సం సృష్టించాయి. పోలీసులపైనే దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఇటీవల పోలీసులు ఇద్దరు రౌడీలను అరెస్టు చేశారు. 


హైదరాబాద్ నగరంలో రౌడీ మూకలు బీభత్సం సృష్టించాయి. పోలీసులపైనే దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఇటీవల పోలీసులు ఇద్దరు రౌడీలను అరెస్టు చేశారు. దీంతో... ఆగ్రహంతో ఊగిపోయిన ఇతర రౌడీ మూకలు... పోలీస్ స్టేషన్ పై దాడి చేశాయి. ఈ సంఘటన హైదరాబాద్ హబిబ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఓ ఇద్దరు రౌడీలను హబిబ్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న అనుమానంతో రౌడీమూకలు హబిబ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడుతూ వారిపై కూడా దాడికి యత్నించారు. అంతు చూస్తామంటూ పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.

PREV
click me!

Recommended Stories

IRCTC Jyotirlinga Yatra: ఒక్క టికెట్‌తో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Cyclone Arnab Alert: సైక్లోన్ అర్నబ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలకు పెను ముప్పు.. ఆ తేదీల్లో భారీ వర్షాలు