టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను చంపాలని చూస్తోంది: రేవంత్ రెడ్డి

By Nagaraju TFirst Published Nov 29, 2018, 6:28 PM IST
Highlights

 కేసీఆర్ ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎన్నిరకాలుగా చెరబట్టాలో అన్ని రకాలుగా చెరబట్టారన్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నివాసంలో  ఇన్  కం టాక్స్ అధికారులు దాడులు చేశారు. దాడుల అనంతరం నివేదికను రహస్యంగా ఎన్నికల ప్రధాన అధికారికి  అందజేసినట్లు తెలిపారు. 

అయితే కొన్ని పత్రికలకు, ఛానెల్స్ కు కేవలం రూ.51 లక్ష దొరికినట్లు లీకులు ఇచ్చారని రేవంత్ తెలిపారు. అయితే వాస్తవంగా దొరికింది మాత్రం రూ.17కోట్ల 51 లక్ష నగదు దొరికిందని తెలిపారు. నాలుగు నెలల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడైతే నివశిస్తున్నారో అక్కడ నగదు దొరికిందన్నారు.  

అయితే ఇన్ కం ట్యాక్స్ దాడులలో ఒక డైరీ దొరికిందని ఆ డైరీలో ఏయే నేతలను కొనుగోలు చెయ్యాలని ఎంతెంత ఇవ్వాలి అన్నది ఆ డైరీలో పూర్తి వివరాలు ఉన్నట్లు రేవంత్ తెలిపారు. మెుత్తం కొడంగల్ ఎన్నికకు సంబంధించి రూ.51 కోట్లు ఖర్చు చేసేందుకు అన్ని వివరాలు ఆ డైరీలో ఉన్నట్లు తెలిపారు. 

టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన నగదు, డైరీలో ఎన్నో కీలక ఆధారాలు ఉన్నట్లు రేవంత్ తెలిపారు. ఐటీ దాడుల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ప్రధాని కార్యాలయంలోని కీలక వ్యక్తులు రంగంలోకి దిగారన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి, ఐటీ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని రేవంత్ ఆరోపించారు. ఆ డైరీలో పోలీస్ శాఖలోని కీలక వ్యక్తులకు కోట్ల రూపాయల పంపిణీకి సంబంధించి వివరాలు ఉన్నట్లు రేవంత్ ఆరోపించారు. 

ఇకపోతే తనకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించినా తనకు కల్పించడం లేదన్నారు. కేంద్ర అధికారులు తనకు రక్షణ కల్పించాల్సి ఉన్నా కల్పించడం లేదన్నారు. హోం సెక్రటరీకి కేంద్ర ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసిన రక్షణ కల్పించడం లేదన్నారు. 

తనపై దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో గద్దర్ మాదిరిగానే తనపై కూడా దాడి జరగొచ్చన్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులే తనపై దాడికి పాల్పడినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. గద్దర్ పై దాడికి ఎలా అయితే పాల్పడ్డారో అలాంటి తరహాలోనే, నక్సల్స్ ఏరివేతలో నిపుణులైన పోలీసులతో తనను అంతమెుందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ధిష్టమైన పథక రచన చేసిందని రేవంత్ ఆరోపంచారు. డీజీపీ మహేందర్ రెడ్డి, డీఐజీ ప్రభాకర్ రావు లు ప్రభుత్వ ప్రణాళికలను అమలు చేస్తున్నారని తెలిపారు.  

గతంలో తాను పార్టీ ఫిరాయింపుల కోసం చెప్పానని అది నిజమైందని, ఐటీ, ఈడీ దాడుల గురించి చెప్పానని అది కూడా నిజమైందని, ఇప్పుడు కూడా చెప్తున్నా తనపై దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. తాను హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గం వెళ్తున్నానని మధ్యలో తనపై దాడి జరిగొచ్చని ప్రజలంతా గమనించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రేవత్ కోరారు. 

click me!