పిల్లలకు తండ్రిలా ఉంటానని చెప్పి మహిళతో సహజీవనం.. అదను చూసి కూతురిపై లైంగికదాడి..

Published : Aug 31, 2021, 10:45 AM IST
పిల్లలకు తండ్రిలా ఉంటానని చెప్పి మహిళతో సహజీవనం.. అదను చూసి కూతురిపై లైంగికదాడి..

సారాంశం

తండ్రి స్థానంలో ఉంటానని నమ్మించడంతో అతనితో కలిసి సహజీవనం చేస్తోంది. కొద్ది నెలల కిందట వారు, పనికోసం నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సమీపంలో పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. బోనాల పండుగ నేపత్యంలో మెట్టుగూడ ప్రాంతంలో ఉన్న మహిళ తల్లి ఇంటికి కుమార్తెను పంపింది. 

జూబ్లీహిల్స్ : మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె కుమార్తె మీద లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన మహిళ (32)కు 2006లో వివాహమయ్యింది. కుమారుడు (17) కుమార్తె (15) ఉణ్నారు. కుటుంబంలో గొడవల కారణంగా భర్తను వదిలేసి తన పిల్లలతో కలిసి ఆమె నివసిస్తోంది. 

అదే ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ పనిచేసే బేతమాల కృష్ణ (35)తో పరిచయం  ఏర్పడింది. తండ్రి స్థానంలో ఉంటానని నమ్మించడంతో అతనితో కలిసి సహజీవనం చేస్తోంది. కొద్ది నెలల కిందట వారు, పనికోసం నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సమీపంలో పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. బోనాల పండుగ నేపత్యంలో మెట్టుగూడ ప్రాంతంలో ఉన్న మహిళ తల్లి ఇంటికి కుమార్తెను పంపింది. 

తిరిగి వచ్చినప్పటినుంచి కుమార్తె దిగులుగా, భయం భయంగా ఉండటంతో తల్లి ఆరా తీసింది. ఈ నెల 7న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణ తనమీద లైంగిక దాడికి పాల్పడ్డాడని కుమార్తె తల్లిక వివరించింది. ఆమె కృష్ణతో గొడవ పడటంతో అక్కడినుంచి పరారయ్యాడు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?