రంగారెడ్డి కలెక్టర్ రాష్ట్రంలో నంబర్ వన్... ధరణి సమస్యల్లో వేగవంతమైన పరిష్కారం.

Published : Apr 25, 2022, 05:24 PM IST
రంగారెడ్డి కలెక్టర్ రాష్ట్రంలో నంబర్ వన్... ధరణి సమస్యల్లో వేగవంతమైన పరిష్కారం.

సారాంశం

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ నెంబర్ వన్ కలెక్టర్‌గా నిలిచారు. రైతన్నలు ఎదుర్కొనే ధరణి సమస్యలు ఎన్నింటినో ఆయన పరిష్కరించారు. రైతుల సమస్యలకు చిటికెలో స్పందించి విలువైన భూముల విషయంలో వివాదాలు లేకుండా చేసిన కలెక్టర్ అమోయ్ కుమార్ రాష్ట్రంలో నెంబర్ వన్ కలెక్టర్‌గా నిలిచారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ జిల్లాపై తనదైన ముద్ర వేశారు. రైతు సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ భూములను కాపాడటానికి ఆయన పెద్ద పీట వేశారు. అందుకే అనతి కాలంలోనే ప్రజల గుర్తింపు పొందారు. ధరణి సమస్యల పట్ల చాలా వేగంగా స్పందించి జిల్లా ప్రజల మన్ననలు పొందారు. అందుకే ఆయన రాష్ట్రంలో నెంబర్ వన్ కలెక్టర్‌గా నిలిచారు.

రైతు సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సమస్యలను పరిష్కరించడం కోసం ఆయన చూపుతోన్న చొరవ అన్నదాతలను ఆకట్టుకుంటోంది. తన భూమి సమస్యను పరిష్కారించాలంటూ.. రెండు నెలల క్రితం ఓ రైతు కలెక్టర్‌కు మెసేజ్ పెట్టారు. వెంటనే స్పందించిన అమోయ్ కుమార్ రికార్డులను స్వయంగా సరిచేసి మరీ రెండు రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించారు. 

రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌కు ఆనుకొని ఉండటంతో... ఇక్కడి భూముల ధర కోట్లు పలుకుతుంది. దీంతో ప్రభుత్వ భూముల కబ్జాలు.. కోర్టు కేసులు కూడా ఎక్కువే. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్.. కబ్జా సమస్యలను పరిష్కరించి కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడారు. జిల్లాలోని చెరువులను కాపాడటం కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

రంగారెడ్డి జిల్లాలో అనేక భూ సమస్యలను పరిష్కరించడంలో అమోయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. దేశంలో కరోనా సమయంలో  అద్భుతమైన సహాయ కార్యక్రమాలు చేసిన కలెక్టర్ల వివరాలను ఈ ఏప్రిల్ నెలారంభంలో ‘ఫేమ్ ఇండియా’ ఎంపిక ప్రకటించింది. ఈ జాబితాలో కలెక్టర్ అమోయ్ కుమార్ దేశంలోనే మళ్లీ టాప్-50లో చోటు దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి కీలకమైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న అమోయ్ కుమార్ పని తీరు పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Jobs : 2026 లో నిరుద్యోగుల కలలు నిజం... ఇన్ని వేల పోస్టుల భర్తీనా..!
IMD Cold Wave Alert : ఇక చలిగాలులకు బ్రేక్ ... ఈ వారంరోజులు రిలాక్స్.. తర్వాత మళ్ళీ గజగజే..!