కారణమిదీ: రేవంత్, రాహుల్ పై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

By narsimha lode  |  First Published May 3, 2022, 3:56 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై ఎన్‌హెచ్ ఆర్ సీకి రామారావు అనే న్యాయవాది పిర్యాదు చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని రామారావు ఆ ఫిర్యాదులో ఆరోపించారు.


హైదరాబాద్: TPCC చీఫ్ Revanth Reddyతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Raul Gandhiగాంధీలపై  న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పిర్యాదు చేశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రామారావు NHRC కు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 7వ తేదీన AICC మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్శిటీలో  విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అయితే రాహుల్ గాంధీ సమావేశానికి ఓయూ వీసీ రవీందర్ అనుమతి ఇవ్వలేదు. రాజకీయ పార్టీల సమావేశాలు, సభలకు అనుమతివ్వకూడదనే నిర్ణయంలో భాగంగానే రాహుల్ మీటింగ్ కు అనుమతివ్వలేదని ఓయూ వీసీ Ravinder చెప్పారు. అయితే రాహుల్ గాంధీ మీటింగ్ కి రాజకీయాలతో సంబంధం లేదని కూడా Congress ప్రకటించింది.

Latest Videos

undefined

రాహుల్ గాంధీ సమావేశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని Telangana High Court  ఓయూ వీసిని ఆదేశించింది. ఓయూ విద్యార్ధులు సోమవారం నాడు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై  హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ఓయూ వీసీని కలవాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు ఓయూ విద్యార్ధి జేఏసీ ప్రతినిధులతో Jagga Reddy  మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఓయూలో రాహుల్ గాంధీ టూర్ విషయమై చర్చించారు. రేపు మరోసారి ఓయూ వీసీని కలవాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు.

రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్శిటీకి తీసుకెళ్తామని కూడా కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు.రాహుల్  ను ఓయూకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలగా ఉన్నారు. ప్రభుత్వం ఒత్తిడి చేయడంతోనే రాహుల్ టూర్ కి ఓయూ వీసీ అనుమతివ్వలేదని  కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

Nepal నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఓయూకి  వచ్చి రాహుల్ గాంధీ ఏం చెబుతారని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. క్లబ్ లకు వెళ్లి మద్యం తాగాలని చెబుతారా అని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. 

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఓయూకి వస్తే అడ్డుకొంటామని టీఆర్ఎస్వీ ప్రకటించింది. నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అయిన తర్వాత ఓయూలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

click me!