Rahul Gandhi Telangana tour: చంచల్‌గూడ జైలులో ములాఖత్‌కు రాహుల్‌ గాంధీకి అనుమతి

Published : May 07, 2022, 10:46 AM ISTUpdated : May 07, 2022, 11:11 AM IST
  Rahul Gandhi Telangana tour: చంచల్‌గూడ జైలులో ములాఖత్‌కు రాహుల్‌ గాంధీకి అనుమతి

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. అయితే రాహుల్ చంచల్ గూడ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. చంచల్ గూడ్ జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూ నేతలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి లభించింది. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. అయితే రాహుల్ చంచల్ గూడ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. చంచల్ గూడ్ జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూ నేతలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతో పాటు మరోక్కరికి మాత్రమే ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించేందుకు జైళ్ల శాఖ అనుమతించింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ అధికారికంగా ధ్రువీకరించారు. దీంతో కాసేపట్లో

ఇక, రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఎన్‌ఎస్‌యూఐ రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు వీసీ చాంబర్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఓయూ వీసీ రవీందర్ కు అందజేసేందుకు పింక్ కలర్ చీర, జాకెట్, గాజులు, మల్లె పూలను తీసుకుని వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం  అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వెంకట్‌తో పాటు ఇతర నేతలను అరెస్టు చేశారు.

బల్మూరి వెంకట్ తో పాటు 18 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారని వారు ఆరోపించారు. ఆదివారం బల్మూరి వెంకట్ తో సహా మొత్తం 18 మంది నాయకులను 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైలుకు తరలించాలని  నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ.. చంచల్ గూడ‌కు వస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 

ఇందుకు సంబంధించి కాంగ్రెస్ నేతలు జైలు సూపరింటెండెంట్‌ను అనుమతి కోరుతూ వినతిపత్రం అందజేశారు. అయితే అందుకు జైలు అధికారులు సూపరింటెండెంట్‌ అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కాంగ్రెస్ దరఖాస్తు చేసుకోగా.. జైళ్ల శాఖ నేడు అనుమతించింది. 

ఇక,నిన్న వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రాహుల్ బస చేశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన అల్పాహారం చేశారు. అనంతరం పలు మీడియా సంస్థల అధిపతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో హోటల్‌లోనే ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. 

అనంతరం మధ్యాహ్నం హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. అక్కడ దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి చంచల్‌గూడ్ జైలుకు వెళతారు. అక్కడి నుంచి బయలుదేరి 1:30 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. గాంధీభవన్ లో పార్టీ extended మీటింగ్ లో పాల్గొంటారు. 2:45 నుంచి 2:50 గంటల వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ  కార్య‌క్ర‌మం అనంత‌రం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu