కొమురం భీమ్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ మిస్ ఫైర్ అయింది.ఈ ఘటనలో కానిస్టేబుల్ గాయపడ్డాడు.గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స కోసం తరలించారు.
కౌటాల:కొమురం భీమ్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో మంగళవారంనాడు గన్ మిస్ ఫైర్ అయింది.ఈ ఘటనలో సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రజనీకుమార్ గాయపడ్డాడు.గాయపడిన కానిస్టేబుల్ ను స్థానిక ఆసుప్రతికి తరలించి చికిత్సఅందిస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రజనీకుమార్ మృతి
కౌటాల పోలీస్ స్టేషన్ లో సెంట్రీ డ్యూటీలో ఉన్న రజనీ కుమార్ కు గన్ మిస్ ఫైర్ కావడంతో రజనీకుమార్ గాయపడ్డారు.ఆయనను కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ ప్రాథమికి చికిత్స చేశారు.మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రజీనీకుమార్ మృతి చెందినట్టుగా పోలీసులుప్రకటించారు. 2020 బ్యాచ్ కు చెందిన రజనీకుమార్ కౌటాల పోలీస్ స్టేషన్ లో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గన్ మిస్ ఫైర్ కావడానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.గతంలో కూడ ఈ తరహా ప్రమాదాలు జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కాచన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ సంతోష్ మృతి చెందాడు.నైట్ డ్యూటీలో ఉన్నఆయన ఆయుధాలను పరిశీలిస్తున్నసమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 12న జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సబ్ జైలులో గన్ మిస్ ఫైర్ అయి ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతి చెందాడు.విధులు ముగించుకొని మరో కానిస్టేబుల్ కు బాధ్యతలు అప్పగిస్తున్నసమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన 2021 మే 8వ తేదీన చోటు చేసుకుంది.కుమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీ పోలీస్ స్టేషన్ లో తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు.2020 ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 ఏప్రిల్ 12న గన్ మిస్ ఫైర్ తో వివాహిత మృతి చెందింది.ఏపీలో ఏఏస్పీ స్థాయి అధికారి అనంతపురం పర్యటనకు వెళ్తూ తన తుపాకీని హోంగార్డు వద్ద భద్రపర్చాడు.తుపాకీని ఇంట్లో దాచిపెట్టాడు.హొంగార్డు .ఈ తుపాకీని భార్యకు చూపిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి అతని భార్య మృతి చెందింది.