వైద్య విద్యార్ధిని పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన

Published : Jul 31, 2019, 03:13 PM ISTUpdated : Jul 31, 2019, 03:15 PM IST
వైద్య విద్యార్ధిని పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన

సారాంశం

హైద్రాబాద్ పాతబస్తీలోని యునాని ఆయుర్వేద ఆసుపత్రిని తరలించొద్దని ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్ధిని పట్ల  కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు.

హైదరాబాద్: హైద్రాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న యునాని ఆయుర్వేద ఆసుపత్రిని తరలించవద్దని  ఆందోళన చేస్తున్న సమయంలో  కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చార్మినార్ వద్ద ఉన్న యునాని ఆయుర్వేద ఆసుపత్రిని తరలించొద్దని  విద్యార్ధులు, అధ్యాపకులు బుధవారం నాడు ఆందోళన చేస్తున్నారు ఆందోళనకారులను అరెస్ట్ చేసే సమయంలో  ఓ కానిస్టేబుల్ ఓ విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

రోడ్డుపైనే బైఠాయించిన విద్యార్ధినిని పైకి లేపేందుకు  మహిళా కానిస్టేబుల్ ప్రయత్నిస్తుంగా కానిస్టేబుల్  విద్యార్ధిని గిల్లాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడ విద్యార్ధినులతో పురుష కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది.

ఈ తీరును  విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. మరో వైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ