కేసీఆర్ ను కించపర్చేలా నాటకం: ఇద్దరు కళాకారుల అరెస్ట్

Published : Jun 29, 2022, 10:10 AM IST
కేసీఆర్ ను కించపర్చేలా నాటకం: ఇద్దరు కళాకారుల అరెస్ట్

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ ను కించపర్చేలా నాటకం వేసిన ఇద్దరు కళాకారులను హయత్ నగర్ పోలీసులు మంగళవారం నాడు సాయంత్రం అరెస్ట్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొమ్ము శ్రీరాములు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రవిలను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR ను కించపర్చేలా నాటకం వేసిన ఇద్దరు కళాకారులను Hayath Nagar పోలీసులు  అరెస్ట్ చేశారు.

Suryapet  జిల్లా నూతన్ కల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన kommu Sriramulu, వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండల పరిధిలోని దూపకుంటకు చెందిన బరుపట్ల Raju  అలియాస్ రవిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2 వ తేదీన  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని BJP నిర్వహించిన  నాటకంలో సీఎం  కేసీఆర్ ను కించపర్చేలా ఈ ఇద్దరు కళాకారులు పాత్రలను పోషించారు. దీంతో ఈ ఇద్దరిని పోలీసులు నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. 

మరో వైపు ఇదే కేసులో బీజేపీ నేత Jitta balakrishna reddyని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. ఇదే కసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

ఈ నెల జూన్ 2వ తేదీన ఘట్ కేసర్ లో  నిర్వహించిన ‘అమరుల యాదిలో…  ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో కేసీఆర్  ను కించపరిచేలా ‘స్కిట్’ చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.  అయితే తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తనను అరెస్టు చేయడం ఏమిటని  జిట్టా బాలకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. 

ఈ కేసులో జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు బీజేపీకి చెందిన రాణీరుద్రమదేవిని కూడా ఎల్లన్నను  పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు.  ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో విద్వేషాలు, అశాంతిని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో సీఎం, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో ఈ నాటకం వేయించారని పోలీసులక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలు ఈ నాటకంలో తప్పుడు ప్రచారం చేశారని టీఆర్ఎస్ ఆరోపించింది.  అంతేకాదు సీఎం కేసీఆర్ పై వ్యక్తిగతంగా దాడికి దిగారని కూడా టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్