POCSO Court: తెలంగాణ‌లో POCSO Court ఏర్పాటు

Published : Feb 14, 2022, 12:03 PM IST
POCSO Court:  తెలంగాణ‌లో POCSO Court ఏర్పాటు

సారాంశం

POCSO Court:   చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్లును కఠినంగా శిక్షించేందుకు మహబూబాబాద్‌ జిల్లాతో పాటు జనగామలోనూ పోక్సో కోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి..  

POCSO Court:   దేశంలో అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పెరిగిపోతున్నాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో చాలా మంది నిందితులు త‌ప్పించుకుంటున్నారు. మ‌రి ముఖ్యంగా గిరిజన, ఆదివాసీ తండాల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో మృగాళ్లు త‌ప్పించుకుంటున్నారు. ఇలాంటి నేర‌గాళ్లను క‌ఠినంగా శిక్షించ‌డానికి, ఇలాంటి నేరాల‌కు అదుపు చేయ‌డానికి, బాధితుల ప‌క్ష‌న అండ‌గా నిలిచేందుకు మ‌న న్యాయ వ్య‌వస్థ‌, తెలంగాణ స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకుంది. చిన్నారుల‌పై ఆకృత్యాల‌కు పాల్పడే మృగాళ్లుకు త్వ‌రిత‌గ‌తిన శిక్షించేందుకు రాష్ట్రంలో పోక్సో కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా గిరిజన తెగలు, వెనుక బ‌డిన, మారుమూల ప్రాంతాల్లో జ‌రుగుతున్నాయి. దీంతో   గిరిజన తెగలు ఎక్కువగా ఉండే మహబూబాబాద్‌ జిల్లాతో పాటు జనగామలోనూ పోక్సో కోర్టు ఏర్పాటు చేసింది.
  
వీటిని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్​చంద్ర శర్మ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కోర్టులో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. బాధితుల నుంచి సమాచారం తెలుసుకునేందుకు అనువైన వాతావరణం కల్పించారు. లైంగిక దాడికి గురైన బాధితుల నుంచి వివ‌రాల‌ను గోప్యంగా సేక‌రించేలా నిర్మించారు. బాధితురాలి తల్లిదండ్రులు బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. బాధితులు భయపడే పరిస్థితి లేకుండా కోర్టులో ఆహ్లాదకరమైన వాతారణాన్ని ఏర్పాటుచేశారు. ఈ కోర్టును ఓ కార్పొరేట్‌ స్కూల్‌లా ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌తో కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించారు. పిల్లలపై అత్యాచార కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పోక్సో కోర్టుకు ఏర్పాటు చేసింది.  మహబూబాబాద్ లో పోక్సో కోర్టు ఏర్పాటు చేయ‌డంతో తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టుపై అభినందనలు వెలువెత్తుతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu