
IPL సీజన్ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC Sajjanar కీలక సూచనలు చేశారు. క్రికెట్‌ను కేవలం ఆటగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. డబ్బు కోసం బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రదేశాల్లో జరిగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై కూడా ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు.