వైఎస్ షర్మిలకు తెలంగాణ సింధూరం.. నిజామాబాద్ వాసుల కానుక...

Published : Mar 01, 2021, 01:36 PM ISTUpdated : Mar 01, 2021, 02:02 PM IST
వైఎస్ షర్మిలకు తెలంగాణ సింధూరం.. నిజామాబాద్ వాసుల కానుక...

సారాంశం

తెలంగాణలో కొత్తపార్టీ పెట్టే సన్నాహకాల్లో వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు. ఆమె నివాసం వద్ద అభిమానుల సందడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిలకు నిజామాబాద్ అభిమానులు తెలంగాణ సింధూరం అందించారు. 

తెలంగాణలో కొత్తపార్టీ పెట్టే సన్నాహకాల్లో వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు. ఆమె నివాసం వద్ద అభిమానుల సందడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిలకు నిజామాబాద్ అభిమానులు తెలంగాణ సింధూరం అందించారు. 

రేపు మహబూబ్ నగర్ జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. 300మందితో జిల్లా సమస్యలపై షర్మిల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. కాగా 
ఇప్పటికే ఆమె దివంగత వైయస్సార్ అభిమానులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభిమానుల సలహాలను తీసుకుంటున్నారు. ఆమెతో ఇప్పటికే పలువురు నేతలు, మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు భేటీ అయ్యారు. 

మరోవైపు షర్మిల తాను పెట్టబోతున్న పార్టీకి సంబంధించి అధికారికంగా తొలి నియామకం చేశారు. తన కార్యక్రమాల సమన్వయకర్తగా వాడుక రాజగోపాల్ ను నియమించారు. 

రాజగోపాల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినవారు. వైయస్ కుటుంబంతో ఆయనకు 30 ఏళ్లుగా పరిచయం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,  రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ దయానంద్ పార్టీకి రాజీనామా చేశారు. 

గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షర్మిలకు మద్దతు ప్రకటించానని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?