అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు...: కవిత

Published : Dec 21, 2018, 03:13 PM ISTUpdated : Dec 21, 2018, 03:16 PM IST
అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు...: కవిత

సారాంశం

ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ ద్వారా '' జగన్ అన్నా...మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే'' అంటూ కవిత ట్వీట్ చేశారు. 

కవిత ట్వీట్ పై జగన్మోహన్ రెడ్డి  కూడా స్పందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కవితమ్మకు ధన్యవాదాలు అంటూ జగన్ ట్విట్టర్ ద్వారానే జవాబిచ్చారు. జగన్ ఎంపి కవితను కవితమ్మ అంటూ సంభోదించడం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. 

తెలంగాణ ఎన్నికల నుండి ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమను ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగానే విమర్శలకు  దిగారు. శతృవుకు శతృవు మిత్రువు అన్నట్లుగా చంద్రబాబు ఏపిలో రాజకీయ శతృవైన జగన్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. అవసరమైతే ఏపి ఎన్నికల్లో జగన్ కు అండగా నిలుస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 

ఇలా రాజకీయంగా దగ్గరవుతున్న తరుణంలో జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ ఎంపి కవిత ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ కు జగన్ స్పందించడంపై అప్పుడే రాజకీయ చర్చ ప్రారంభమయ్యింది. రాజకీయ నాయకులు ఒకరికొకరు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం సహజమే అయినప్పటికి ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ కు కవిత చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ