హైద్రాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం: సజ్జనార్

By narsimha lodeFirst Published Dec 25, 2020, 1:18 PM IST
Highlights

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని వేడుకలపై నిషేధం విధించినట్టుగా పోలీస్ శాఖ ప్రకటించింది. కరోనా కొత్త రకం వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

హైదరాబాద్:కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని వేడుకలపై నిషేధం విధించినట్టుగా పోలీస్ శాఖ ప్రకటించింది. కరోనా కొత్త రకం వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

శుక్రవారం నాడు సైబరాబాద్ సీపీ సజ్జనార్  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతి లేదని చెప్పారు.  డ్రంకైన్ డ్రైవ్ పై ఇప్పటికే చెకింగ్స్ మొదలుపెట్టినట్టుగా ఆయన తెలిపారు.

రిసార్ట్స్, పబ్ లపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. తాగి వాహనం నడిపితే చర్యలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. పబ్‌లు, క్లబ్బులకు అనుమతి లేదని ఆయన తేల్చి చెప్పారు.

గేటేడ్ కమ్యూనిటీలలో కూడా కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించవద్దని ఆయన సూచించారు.స్టార్ హోటల్స్ లో రోజువారీ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉందని సజ్జనార్ చెప్పారు.

బ్రిటన్ నుండి తెలంగాణకు సుమారు 3 వేల మంది వచ్చారు. వీరిని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొందరిని గుర్తించి వారి నుండి శాంపిల్స్ సేకరించారు. మిగిలినవారి నుండి కూడ శాంపిల్స్ సేకరించే పనిలో ఉన్నారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో  బ్రిటన్ నుండి 3 వేల మంది రాష్ట్రానికి రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.


 

click me!