కేసీఆర్ తోనే...: తెల్లకాగితంపై ఫాక్స్ ద్వారా వైఎస్ కు రాజీనామా లేఖ

By telugu teamFirst Published Oct 22, 2020, 7:35 AM IST
Highlights

'టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద నాయిని నర్సింహా రెడ్డి అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఆయన చెప్పిందే తడవుగా అమెరికా నుంచి వైఎస్ కు తెల్ల కాగితంపై రాజీనామా లేఖ పంపించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను ఏర్పాటు చేసిన తర్వాత కె. చంద్రశేఖర రావు వెంట నిరంతరం నాయిని నర్సింహా రెడ్డి ఉండేవారు. కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం ప్రదర్శించారు. ఓ సందర్భంలో ఆయన కేసీఆర్ ను ఆయన తన భుజాల మీద మోశారు. కేసీఆర్ మీద ఆయన అపారమైన విశ్వాసాన్ని ఉంచారు.

1999లోని శాసనసభ ఎన్నికలకు ముందు నాయిని నర్సింహా రెడ్జి జనతా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. చివరి క్షణంలో ఆయనకు ముషీరాబాద్ నియోజకవర్గం టీడీపీ టికెట్ తప్పిపోయింది. పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించారు. దాంతో ఆయన పోటీ చేయలేకపోయారు. కొద్దికాలం టీడీపీలో కొనసాగిన ఆయన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ లో చేరారు. 

నాయిని నర్సింహా రెడ్డి 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి టీఆర్ఎస్, కాంగ్రెసు మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి డాక్టర్ కె. లక్ష్మణ్ మీద విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గంలో సాంకేతిక విద్యా శఆఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ తప్పుకుంటున్నట్లు 2008లో కేసీఆర్ ప్రకటించారు. 

ఆ సమయంలో నాయిని నర్సింహా రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తన రాజీనామా పత్రాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టి. మణెమ్మ చేతిలో ఓడిపోయారు. 

నాయిని నర్సింహారెడ్డి అత్యవసర పరిస్థితి కాలంలో ైజలు జీవితం కూడా గడిపారు. 1975లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. దాంతో 1977లో 18 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 

click me!