మునుగోడు ఉపఎన్నిక : కేసీఆర్‌తో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భేటీ

Siva Kodati |  
Published : Oct 07, 2022, 03:16 PM IST
మునుగోడు ఉపఎన్నిక : కేసీఆర్‌తో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భేటీ

సారాంశం

మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎంపికైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మునుగోడు అభ్యర్ధిగా తనను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు కూసుకుంట్ల. తనపై నమ్మకం వుంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.   

మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎంపికైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బీ ఫామ్‌ను ఆయనకు అందజేశారు కేసీఆర్. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు అభ్యర్ధిగా తనను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు కూసుకుంట్ల. తనపై నమ్మకం వుంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

ఇకపోతే... మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. సీఎం కేసీఆర్  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును శుక్రవారం నాడు  ప్రకటించారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచి కొనసాగుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్ధిగా కేసీఆర్ ప్రకటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టులను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్  ఈ నిర్ణయం తీసుకున్నారు

ALso REad:మునుగోడులో అసంతృప్తులను బుజ్జగించిన కేసీఆర్.. కూసుకుంట్లను గెలిపిస్తామన్న కర్నె , నర్సయ్యగౌడ్

2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు నర్సయ్య గౌడ్. టికెట్ ఆశించడం తప్పు కాదని.. తన అవసరం జాతీయ రాజకీయాల్లో వుంటుందని కేసీఆర్ అన్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ ఆదేశాలు పాటిస్తానని నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు. కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి లేదన్నారు. అందరిలాగే తాను కూడా టికెట్ ఆశించానని.. తనకు ఆ హక్కు వుందని కర్నె చెప్పారు. కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత తమపై వుందని ఆయన పేర్కొన్నారు. అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని కర్నె చెప్పారు. కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆయన పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu