టీఆర్ఎస్‌కి షాక్:యుగ తులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ కి రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపు

By narsimha lode  |  First Published Oct 20, 2022, 10:52 AM IST

మునుగోడు ఉప ఎన్నికల్లో  బరిలో నిలిచిన యుగ తులసి  పార్టీ  అభ్యర్ధి శివకుమార్ కి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది.శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపు విషయంలో చోటు చేసుకున్న వివాదంపై ఇవాళ సాయంత్రంలోపుగా వివరణ  ఇవ్వాలని  ఈసీ ఆదేశించింది.
 


హైదరాబాద్:టీఆర్ఎస్ అభ్యంతరం తెలిపినా  యుగ తులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్‌కి ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. కారు గుర్తును పోలిన ఎన్నికల  గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని  ఈసీని టీఆర్ఎస్ కోరింది. అయితే ఇందుకు  భిన్నంగా మునుగోడు ఉప  ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తును ఈసీ శివకుమార్ కు కేటాయించింది.

ఈ నెల 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు  ముగిసింది.  అదే  రోజున అభ్యర్ధులకు గుర్తులు కేటాయించాలి. కానీ అదే రోజున అభ్యర్ధులకు గుర్తులను కేటాయించలేదు. ఈ నెల 18 న బరిలో నిలిచిన అభ్యర్ధులకు గుర్తులను కేటాయిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్నారు.

Latest Videos

గుర్తుల కేటాయింపు సమయంలో తీసిన లాటరీలో యుగ తులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ కి రోడ్డు రోలర్ గుర్తు దక్కిందని  ఆయన  చెబుతున్నారు. ఈ గుర్తుపై గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పిర్యాదు చేసింది.దీంతో  ఈ గుర్తును శివకుమార్ కు కేటాయించలేదు. అధికార పార్టీ ఒత్తిడితో తనకు ఈ గుర్తును కేటాయించలేదని శివకుమార్  ఆందోళన  నిర్వహించారు. మరో వైపు ఈ గుర్తును ఆశించిన రిజిష్టర్ పార్టీ అభ్యర్ధి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు.హైద్రాబాద్ కు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం  డిప్యూటీ కమిషనర్ కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ విషయమై న్యాయం చేస్తామని కేంద్ర ఎన్నికల  సంఘం డిప్యూటీ కమిషనర్ రిజిస్టర్ట్ పార్టీ  ప్రతినిధికి హామీ ఇచ్చారు. రోడ్డు రోలర్ గుర్తును ఎందకు మార్చారో వివరణ  ఇవ్వాలని ఈసీ రిటర్నింగ్ అధికారిని  కోరింది.

తనకు రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ తన సంతకం తీసుకున్నారని శివకుమార్ చెబుతున్నారు. కానీ గుర్తుల కేటాయింపు జాబితాలో మాత్రం తనకు రోడ్డు రోలర్ కేటాయించలేదన్నారు.ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయిస్తానని కూడ చెప్పారు.దీంతో రోడ్డు  రోలర్ గుర్తును శివకుమార్ కే కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫారం 7 ఏ లో మార్పులు  చేయాలని ఈసీ ఆదేశాలు జారీ   చేసింది.

కేటాయించిన ఎన్నికల గుర్తును మార్చే  అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి  మాత్రమే ఉందని ఈసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రిటర్నింగ్  అధికారి తనకు లేని అధికారాన్ని ఉపయోగించారని  ఈసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నామని కూడ  ఈసీ  ప్రకటించింది. రోడ్డు రోలర్ గుర్తును ఎందుకు మార్చాల్సి వచ్చిందో  వివరణ  ఇవ్వాలని  ఎన్నికల రిటర్నింగ్ అధికారిని  ఈసీ ఆదేశించింది. రోడ్డు రోలర్ గుర్తును ఉద్దేశ్యపూర్వకంగా తొలగించారా, లేక పొరపాటు  జరిగిందా అనే విషయాన్ని ఈసీ పరిశీలించనుంది.ఇవాళ సాయంత్రం లోపుగా ఈ విషయమై  వివరణ ఇవ్వాలని  ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఈసీ ఆదేశించింది.

also read:మునుగోడు ఉపఎన్నిక ... రోడ్డు రోలర్ గుర్తుపై లొల్లి, హైదరాబాద్‌‌కు డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్

టీఆర్ఎస్ వాదన  ఇదీ..

కారు గుర్తును పోలిన గుర్తుల కారణంగా తమ పార్టీకి చెందిన అభ్యర్ధుల విజయావకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ రకమైన ఫలితాలు వచ్చిన విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కారు గుర్తును పోలిన రోడ్డురోలర్, కెమెరా, చపాతి రోలర్, డాలీ, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను ఎన్నికల గుర్తుల జాబితా నుండి తొలగించాలని కోరింది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ ఇచ్చింది. ఇదే విషయమై తెలంగాణ  హైకోర్టులో కూడ  పిటిషన్ దాఖలు  చేసింది. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

click me!