విచక్షణ కోల్పోయిన తల్లి.. పిల్లలపై మరీ ఇంత దారుణమా?

Published : May 15, 2023, 05:47 AM IST
 విచక్షణ కోల్పోయిన తల్లి.. పిల్లలపై మరీ ఇంత దారుణమా?

సారాంశం

మాతృదినోత్సవం రోజున ఓ తల్లి కర్కషంగా వ్యవహరించింది. అత్త, భర్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయిన ఓ మహిళ.. అభంశుభం తెలియని తన ఇద్దరు కన్నకొడుకులను తన చేతురాలా చంపివేసింది. ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేసింది. 

మదర్స్ డే నాడు ఓ తల్లి కర్కషంగా ప్రవర్తించింది. భర్త, అత్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయిన ఓ మహిళ. అభంశుభం తెలియని తన ఇద్దరు కన్నకొడుకులపై దారుణంగా ప్రవర్తించింది. కన్న బంధం మరిచి.. తన చేతులతో నీళ్ల టబ్బులో ముంచేసి హతమారింది. ఆపై  తాను విషం తాగి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్‌ పరిధి జిల్లెలగూడలో ఆదివారం జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కుబ్యా తండాకు చెందిన నేనావత్‌ శ్రీనివాస్‌(34), అదే తాండాకు చెందిన భారతి(25)కి 2020లో వివాహమైంది. ఉపాధి కోసం పట్నం వలస వచ్చిన వీరు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జిల్లెలగూడలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరూ సంతానం. విక్కీ(18 నెలలు), లక్కీ(8నెలలు). శ్రీనివాస్‌ ఓ ప్రైవేట్‌ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు.  

అయితే.. గత కొంత కాలంగా శ్రీనివాస్‌, భారతి మధ్య మనస్పర్ధలు తల్లెత్తాయి. ముఖ్యంగా అత్త, కోడళ్లకు అసలు పడేది కాదు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ తల్లి శనివారం జిల్లెలగూడలోని వీరి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీనివాస్ భారతిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆదివారం ఉదయం భారతి తల్లిదండ్రులు తన ఇంటికి రప్పించుకుంది. వారు కూతురికి అల్లుడికి నచ్చజెప్పి వెళ్లిపోయారు. వారితో పాటే శ్రీనివాస్‌ కూడా బయటికి వెళ్లిపోయాడు.  

ఇంట్లో ఎవరి లేని సమయంలో దారుణంగా ప్రవర్తించింది. కన్న పేగు బంధాన్ని మరిచింది. తన ఇద్దరు కొడుకులని ఓ నీళ్ల టబ్బులో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం.. ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  శ్రీనివాస్ తన భార్య భారతికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిప్ట్ చేయకపోవడంతో హుటాహూటినా ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్‌ తన పిల్లలను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.  అదే సమయంలో భారతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం తెలిసి పోలీసులు  ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu