చిన్నారిపై తండ్రి కిరాతకం : బాలుడిపై టర్పెంటైల్ పోసి.. నిప్పంటించి...

Published : Jan 18, 2021, 03:21 PM IST
చిన్నారిపై తండ్రి కిరాతకం : బాలుడిపై టర్పెంటైల్ పోసి.. నిప్పంటించి...

సారాంశం

కొడుకు సరిగా చదవడం లేదని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టిన అమానుష ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగింది. కూకట్‌పల్లిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో సోమవారం ఓ తండ్రి తన పదేళ్ల కొడుకు మీద టర్పెంటైల్ పోసి నిప్పంటించాడు. 

చరణ్‌ అనే పదేళ్ల బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే ఎన్నిసార్లు మందలించినా సరిగా చదవడం లేదని కొడుకుపై తండ్రి కోపానికి వచ్చాడు. 

పలుమార్లు చిన్నారిని విచక్షణారహితంగా కొట్టాడు. అప్పటికీ కొడుకుపై కోపం చల్లారకపోవడంతో ఆదివారం రాత్రి టీవీ చూస్తున్న చరణ్‌పై  టర్పెంటైల్‌ ‌పోసి నిప్పంటించి తగలబెట్టాడు. ఒంటినిండా గాయాలవ్వడంతో బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
PREV
click me!

Recommended Stories

RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?