కేరళను తాకిన రుతుపవనాలు... భారీ వర్షాలు

Published : Jun 08, 2019, 01:27 PM IST
కేరళను తాకిన రుతుపవనాలు... భారీ వర్షాలు

సారాంశం

నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఎండలకు అల్లాడుతున్న ప్రజానీకం రుతుపవనాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది.


నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఎండలకు అల్లాడుతున్న ప్రజానీకం రుతుపవనాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. దీనికి తోడు గత ఏడాది కంటే ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11న ప్రవేశించనున్నాయి. 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ రుతు పవనాల  ప్రభావం ఇప్పటికే తెలుస్తోంది. అక్కడక్కడా వర్షాలు మొదలయ్యాయి. కేరళలలో మరింత ఎక్కువ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో... కేరళలలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu