వివాహితతో రాసలీలు.. అడ్డంగా బుక్కైన డీఎస్పీ గన్ మెన్

Published : Nov 06, 2018, 02:42 PM IST
వివాహితతో రాసలీలు.. అడ్డంగా బుక్కైన డీఎస్పీ గన్ మెన్

సారాంశం

మొయినాబాద్ డీఎస్పీ గన్ మెన్.. వివాహితతో రాసలీలు జరుపుతూ.. అడ్డంగా బుక్కయ్యాడు. మహిళతో గన్ మెన్ ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

మొయినాబాద్ డీఎస్పీ గన్ మెన్.. వివాహితతో రాసలీలు జరుపుతూ.. అడ్డంగా బుక్కయ్యాడు. మహిళతో గన్ మెన్ ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అడ్డంగా దొరికపోయిన గన్ మెన్.. మహిళ భర్తను చంపుతానని బెదిరించగా.. అతను చాకచక్యంగా అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... వికారాబాద్ జిల్లా పుడూర్ మండలానికి చెందిన కుమ్మరి రాజు, శైలజ దంపతులు బతుకుదెరువు కోసం మొయినాబాద్ కి వచ్చి ఓ రెస్టారెంట్ లో పనిచేసుకుంటున్నారు. కాగా.. శైలజకి కొంతకాలం క్రితం డీఎస్పీ గన్ మెన్ రమేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

రాజులేని సమయంలో రమేష్ వాళ్ల ఇంటికి వెళ్లి శైలజతో ఏకాంతంగా గడుపుతున్నాడు. కాగా.. సోమవారం రాత్రి విధులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన రాజుకి.. తన భార్య పరాయి పురుషుడితో ఉండటాన్ని గమనించాడు. దీనిపై రాజు భార్యను ప్రశ్నిస్తుండగా.. అంతలో గన్ మెన్ రమేష్.. తన బ్యాగ్ లోని తుపాకీ తీసి చంపుతానని బెదిరించాడు.

అతని బెదిరింపులకు బెదిరిపోని రాజు.. చాకచక్యంగా రమేష్ ని పట్టుకొని చుట్టుపక్కల వారికి పట్టించాడు. అనంతరం అతనిని పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu