చంపాలని చూస్తున్నారు...టీఆర్ఎస్‌పై రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Dec 24, 2018, 1:24 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితిపై ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని చూస్తున్నారని.. ఇప్పటికే దీనిపై కుట్ర జరుగుతోందని తెలిపారు. ఏడాది క్రితం నుంచే తనను టార్గెట్ చేశారని... దీనిపై కోర్టుకు వెళుతున్నట్లు రాములు నాయక్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సమితిపై ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని చూస్తున్నారని.. ఇప్పటికే దీనిపై కుట్ర జరుగుతోందని తెలిపారు. ఏడాది క్రితం నుంచే తనను టార్గెట్ చేశారని... దీనిపై కోర్టుకు వెళుతున్నట్లు రాములు నాయక్ తెలిపారు.

ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆర్ధికంగా ఇబ్బంది పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. తనకు ఏ హానీ జరిగినా.. ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు.

గిరిజనుల హక్కులు, వారి సమస్యల గురించి మాట్లాడుతున్నందునే తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో వివరణ ఇస్తా అంటే శాసనమండలి ఛైర్మన్ అవకాశం ఇవ్వడం లేదన్నారు.

ఈ నెల 18న తనకు పార్టీ ఫిరాయింపులపై నోటీసు వచ్చిందని.. ఈ రోజు తాను ఛైర్మన్‌ను కలిసి.. నాలుగు వారాల గడువు కావాలని కోరినట్లు రాములు నాయక్ తెలిపారు. మరోవైపు తనపై ఫిర్యాదు చేసిన బోడకంటి వెంకటేశ్వర్లు కూడా పార్టీ మారిన వ్యక్తేనని.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిని కాదని.. గిరిజన సమస్యల గురించి వివరించడానికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశానని ఆయన వెల్లడించారు. సామాజిక సేవకుడి కోటాలో..తాను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రాములు నాయక్ తెలిపారు. టీఆర్ఎస్‌లో నిన్న మొన్నటి వరకు పొలిట్ బ్యూరో లేదని... కానీ తాను పొలిట్ బ్యూరో సభ్యునిగా పేర్కొంటూ వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారన్నారు.

click me!