కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్సీ కవిత.. ఆలయంలో ప్రత్యేక పూజలు..

Published : Sep 14, 2023, 06:11 AM IST
కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్సీ కవిత.. ఆలయంలో ప్రత్యేక పూజలు..

సారాంశం

Kondagattu: జగిత్యాలలోని ప్రసిద్ద శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Kondagattu: జగిత్యాలలోని ప్రసిద్ద శ్రీ కొండగట్టు అంజన్నను నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. బుధవారం సాయంత్ర  ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవితకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.

అనంతరం మహిళలకు కలిసి సహస్రదీపాలంకరణలో పాల్గొన్నారు. అలాగే.. ఆంజనేయ స్వామి అనుబంధ దేవాలయం బేతాల స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత. పూజానంతరం వేదపండితులు ఎమ్మెల్సీ  కవితకు ఆశీర్వచనం అందిచగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్సీ కవితతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పి చైర్ పర్సన్ వసంత కూడా స్వామి వారి దర్శించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి