మీ బాసులనే తరిమికొట్టాం.. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు జగదీశ్ రెడ్డి వార్నింగ్

Siva Kodati |  
Published : Jul 28, 2021, 10:06 PM ISTUpdated : Jul 28, 2021, 10:17 PM IST
మీ బాసులనే తరిమికొట్టాం.. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు జగదీశ్ రెడ్డి వార్నింగ్

సారాంశం

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఉసురు తీసింది వీళ్లేనని మంత్రి మండిపడ్డారు. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా ఖబద్దార్ అంటూ జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.  

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. కృష్ణా నదిలో నల్గొండ జిల్లా వాటా అమ్ముకుని డబ్బులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఉసురు తీసింది వీళ్లేనని మంత్రి మండిపడ్డారు. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా ఖబద్దార్ అంటూ జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. వాళ్ల బాసులనే తరిమి, తరిమి కొట్టామని వీళ్లెంత అంటూ మంత్రి మండిపడ్డారు. వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు గాను కోమటిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తహసీల్దార్ గిరిధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు చౌటుప్పల్ పోలీసులు. 

సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకొంది. రాష్ట్ర ప్రభుత్వం  ఇవాళ కొత్త రేషన్ కార్డులను పంపిణీని ప్రారంభించింది. అయితే  మునుగోడు నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చౌటుప్పల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్బంగా తనకు సమాచారం ఇవ్వకుండా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Flood Alert : తెలంగాణకు పొంచివున్న వరద ముప్పు... ఆస్తి, ప్రాణనష్టం తప్పదా?
భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు | Bonalu 2026 | Asianet News Telugu