ధాన్యం కొనుగోలు వ్యవహారం : తెలంగాణపై మీ మొసలి కన్నీరు ఆపండి.. రాహుల్ గాంధీకి హరీశ్‌రావు కౌంటర్

Siva Kodati |  
Published : Mar 29, 2022, 07:08 PM IST
ధాన్యం కొనుగోలు వ్యవహారం : తెలంగాణపై మీ మొసలి కన్నీరు ఆపండి.. రాహుల్ గాంధీకి హరీశ్‌రావు కౌంటర్

సారాంశం

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మంత్రి హరీశ్ రావు కౌంటరిచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై మీ మొసలి కన్నీరు ఆపాలంటూ ఆయన చురకలు వేశారు. 

తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన సంగతి తెలిసిందే. మామ చల్లని చూపు కోసం అల్లుడి ఆరాటం... మున్ముందు పారా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ మామ అదేశంతో రాసిచ్చిన లేఖ ఇదిగో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) విమర్శనాస్త్రాలు సంధించగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం మంగళవారం ధాన్యం కొనుగోలు అంశంపై స్పందించారు. 

తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకు రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని హెచ్చరించారు. 

దీనిపై టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు (harish rao) తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండి అంటూ రాహుల్ గాంధీకి చురకలు వేశారు. తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంటులో మా ఎంపీలతో కలిసి మీరు ఆందోళన చేయండి... రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయండి అంటూ హరీశ్ సూచించారు. 

అంతకుముందు మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో Paddy  ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి Rahul Gandhi స్పందించారు.  రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు రాష్ట్రంలోని Farmers  తరపున పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే తెలుగులో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో  BJP,TRS ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతలు శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం  పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 

అటు వరి ధాన్యం కొనుగోలు చేయాలని Congress పార్టీ రాష్ట్రంలో ఉద్యమానికి సిద్దమైంది. నెల రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి నిర్వహించిన ఆందోళనలకు ముగింపుగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. సోమవారం నాడు  తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుధీర్ఘంగా సమావేశమైంది. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు. సీనియర్ నేతలు ఆయా జిల్లాల్లో పర్యటించనున్నారు. అంతేకాదు వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. వరి ధాన్యం  కొనుగోలు అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?