వలస కార్మికులకు కరోనా... రాష్ట్రాలకు తలనొప్పి

By telugu news teamFirst Published May 8, 2020, 2:07 PM IST
Highlights

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త సమస్య పుట్టుకొచ్చింది. వలస కార్మికులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. పలువురు వలస కార్మికులకు పాజిటివ్ రాగా.. అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.దీంతో ఈ వైరస్ ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు చాలా యాతనలు పడ్డారు. దీంతో వారి అవస్థలు గమనించిన కేంద్ర ప్రభుత్వం.. వాళ్లని వారి స్వస్థలాలకు పంపించింది.

వలస కార్మికులు తమ స్వస్థలాకు వెళ్లడంతో చాలా మంది ఊపిరిపీల్చుకున్నారు. అయితే... ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త సమస్య పుట్టుకొచ్చింది. వలస కార్మికులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. పలువురు వలస కార్మికులకు పాజిటివ్ రాగా.. అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

తెలంగాణలో ఇటీవల కాస్త లాక్ డౌన్ ని సడలించగా.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. వీరు యాదాద్రి జిల్లాకు చెందిన కార్మికులుగా అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు.. కోవిద్-19 టెస్టులు చేయకుండా ఎవరిని రాష్ట్రంలోకి అనుమతించడంలేదు.రెండు రోజుల క్రితం వరకు కేవలం జిహెచ్‌ఎంసి పరిధిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆకస్మాత్తుగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి నుంచి కరోనా కేసులు రావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఖచ్చితంగా ఇంక్యూబేషన్ పీరియడ్ వరకు క్వారంటైన్‌లో ఉంచుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.

click me!