తమకు వేరే కాలేజీల్లో ఆడ్మిషన్లు ఇప్పించాలని కాళోజీ హెల్త్ యూనివర్శిటీ ముందు సీట్లు రద్దైన కాలేజీలకు చెందిన మెడికోలు సోమవారం నాడు ఆందోళన చేశారు.ఈ విషయమై ఎన్ఎంసీ స్సష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా అమలు చేయడం లేదని మెడికోలు ఆందోళన చేస్తున్నారు.
వరంగల్: ఆడ్మిషన్లు రద్దైన Medical కాలేజీలకు చెందిన విద్యార్ధులు సోమవారం నాడు Kaloji medical Universityఎదుట ఆందోళనకు దిగారు. NMC గైడ్‌లైన్స్ మేరకు తమను వేరే కాలేజీల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Telangana రాష్ట్రంలోని మూడు మెడికల్ కాలేజీల్లోని MBBS, PG సీట్లను రద్దు చేసింది. ఆయా కాలేజీల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ కాలేజీల్లో చేరిన విద్యార్ధులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇవాళ కాళోజీ యూనివర్శిటీ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీని కలిసేందుకు వచ్చారు.Vice chancellor అందుబాటులో లేరని విద్యార్ధులు చెప్పారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్శిటీ ఎదుట ప్లకార్డులు చేతబూని ఆందోళనకు దిగారు.
undefined
తాము చేరిన కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లను రద్దు చేసిన విషయం ఆలస్యంగా తమకు తెలిసిందని మెడికో తెలిపారు.ఈ ఏడాది మే 19న తమకు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విషయం తెలిసిందన్నారు. సీట్లు రద్దైన కాలేజీల్లో చేరిన విద్యార్ధులను వేరే కాలేజీల్లో సీట్లను కేటాయించాలని ఎన్ఎంసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కూడా మెడికోలు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా యూనివర్శిటీ అధికారులు ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నిస్తున్నారు. తమను వేరే కాలేజీలకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్లు కాలేజీల్లో చేరకముందే ఆయా కాలేజీల్లో తమను సర్దు బాటు చేయాలని మెడికోలు కోరుతున్నారు.
also read:తెలంగాణలోని మూడు మెడికల్ కాలేజ్‌ల్లో అడ్మిషన్లు రద్దు చేసిన జాతీయ వైద్య మండలి
రాష్ట్రంలోని మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలపై నేషనల్ మెడికల్ కమిషన్ వేటు వేసింది. సంగారెడ్డి,పటాన్‌చెరు,వికారాబాద్‌లోని మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల పర్మిషన్ను రద్దు చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో ఎన్‌ఎంసీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేశాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 4 ప్రైవేటు కాలేజీల్లో ఈ ఏడాది మార్చి 30న తనిఖీలు చేపట్టాయి. ఈ బృందాల సూచన మేరకు 3 కాలేజీల పర్మిషన్ రద్దు చేయాలని ఎన్‌ఎంసీ నిర్ణయించింది. ఆయా కాలేజీల 2021–-22 అకడమిక్ ఇయర్ పర్మిషన్ రద్దు చేస్తున్నట్టు మే రెండో వారంలో కాలేజీల యాజమాన్యాలకు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్‌ఎంసీ సమాచారం ఇచ్చింది