మల్లారెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారంటూ.. రేవంత్ రెడ్డిపై మేయర్ ఫిర్యాదు..

Published : Aug 28, 2021, 11:50 AM ISTUpdated : Aug 28, 2021, 11:51 AM IST
మల్లారెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారంటూ.. రేవంత్ రెడ్డిపై మేయర్ ఫిర్యాదు..

సారాంశం

రేవంత్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్వో భిక్షపతిరావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

హైదరాబాద్ : మూడు చింతలపల్లిలో దీక్ష చేపట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ తోపాటు పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. 

రేవంత్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్వో భిక్షపతిరావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాప్రాలో కాంగ్రెస్ నాయకులు మంత్రి దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పత్తి కుమార్, నాయకులు టిల్లు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసులు, జగదీష్ పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!