ఐదేళ్లపాటు వర్షాలు పడొద్దు దేవుడా.. వైరలవుతున్న మేయర్ వ్యాఖ్యలు..

By AN TeluguFirst Published Feb 16, 2021, 1:47 PM IST
Highlights

జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి రోజుకో సంచనలనానికి తెర లేపుతున్నారు. తన మాటలు, చేతలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తాను మేయర్ గా ఉన్న ఐదేళ్లు వర్షాలు రావద్దని ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ షాక్ కు గురి చేశారు.

జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి రోజుకో సంచనలనానికి తెర లేపుతున్నారు. తన మాటలు, చేతలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తాను మేయర్ గా ఉన్న ఐదేళ్లు వర్షాలు రావద్దని ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ షాక్ కు గురి చేశారు.

వానలు పడాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవాల్సిన నేతల నోట ఇలాంటి మాటలు రావడంతో సోషల్ మీడియాలో ఇప్పుడామె మాటలు వైరల్ గా మారుతున్నాయి. రకరకాల మీమ్స్ తో నెటిజన్స్ కాస్త గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ అసలేం జరిగిందంటే.. మేయర్ అయిన తరువాత ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవలి వానలకు నగరం అతలాకుతలం అయిన పరిస్థితిని గుర్తుచేస్తూ అలాంటి పరిస్థితి వస్తే మీరేం చేస్తారు అని ఓ ప్రశ్న అడిగారు. దీంతో ఆమె వెంటనే తడుముకోకుండా ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని దేవుణ్ని కోరుకుంటున్నా అన్నారు. 

ఆ తరువాత కంటిన్యూ చేస్తూ ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చేయాల్సినవన్నీ చేస్తుందని చెప్పారు. ప్రజలు కూడా ఆలోచించాలని కోరారు. అంతేకాదు గతంలో జరిగిన నాలాల ఆక్రమణల వల్లనే కాలనీలు, ఇళ్లు వరదలతో మునిగి అతలాకుతలం అయ్యాయని చెప్పుకొచ్చారు. 

అలాగని ఇప్పుడు మేయర్ కాగానే తాను వెళ్లి ఆ ఇళ్లను కూల్చలేనని స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఒక ప్రజాప్రతినిథిగా తాను అలాంటి పని చేయలేనని అన్నారు. కాకపోతే తాను చెప్పగలిగేదేమిటంటే ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. 

click me!