తెలంగాణ కాంగ్రెసుకు షాక్: బిజెపిలోకి మర్రి శశిధర్ రెడ్డి, పద్మిని?

By telugu teamFirst Published Jul 2, 2019, 7:35 AM IST
Highlights

కాంగ్రెసు సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని కూడా బిజెపి గూటికి చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు ఆమె బిజెపిలో చేరి, ఆ వెంటనే తిరిగి కాంగ్రెసులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఖాళీ చేసి తాను బలపడాలనే వ్యూహాన్ని బిజెపి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు కాంగ్రెసు నాయకులకు గాలం వేస్తోంది. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్ధపడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

శానససభ ఎన్నికల్లో ఆయన సనత్ నగర్ సీటును ఆశించినప్పటికీ ఫలితం దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన బిజెపిలో చేరేందుకు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. 

కాంగ్రెసు సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని కూడా బిజెపి గూటికి చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు ఆమె బిజెపిలో చేరి, ఆ వెంటనే తిరిగి కాంగ్రెసులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

మరింత మంది కాంగ్రెసు నేతలు కూడా బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 6వ తేదీన హైదరాబాదు వస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెసు నేతలు కమలం గూటికి చేరుకుంటారని భావిస్తున్నారు. 

click me!