అనుమానం పెనుభూతమై భార్యను కడతేర్చిన భర్త

Published : Aug 12, 2019, 03:32 PM IST
అనుమానం పెనుభూతమై భార్యను కడతేర్చిన భర్త

సారాంశం

ఇకపోతే బషీర్ అహ్మద్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతని భార్యలిద్దరూ సొంత అక్కచెల్లెళ్లు కావడం విశేషం. రెండో భార్య సమీరపై అనుమానం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానం కారణంగా వేధిస్తుండటంతో సమీర గోల్కొండ పీఎస్ లో గతంలో ఫిర్యాదు చేసిందని అయితే కోర్టు బషీర్ అహ్మద్ కు ఫైన్ విధించిందని తెలిపారు. 

హైదరాబాద్: మహిళలపై దాడులను అరికట్టేందుకు ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక కారణంతో మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ గోల్కొండ ఫతే దర్వాజ్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. 

వివరాల్లోకి వెళ్తే గోల్కొండ పీఎస్ పరిధిలో ఫేతే దర్వాజ్ లో బషీర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న బషీర్ కుటుంబంలో గత కొంతకాలంగా కలతలు చెలరేగాయి. దాంతో సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు తన రెండో భార్య సమీరాను గొడ్డలితో నరికిచంపేశాడు. 

అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత గోల్కొండ పీఎస్ కు ఫోన్ చేసి తన రెండో భార్యను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇకపోతే బషీర్ అహ్మద్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతని భార్యలిద్దరూ సొంత అక్కచెల్లెళ్లు కావడం విశేషం. రెండో భార్య సమీరపై అనుమానం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానం కారణంగా వేధిస్తుండటంతో సమీర గోల్కొండ పీఎస్ లో గతంలో ఫిర్యాదు చేసిందని అయితే కోర్టు బషీర్ అహ్మద్ కు ఫైన్ విధించిందని తెలిపారు. 

అయితే గత కొద్ది రోజులుగా సమీరపై తీవ్ర అనుమానంతో ఆమెను అంతమెుందించాలని ప్రయత్నించాడని అందులో భాగంగా తెల్లవారు జామున పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపి ఆమెను హత్య చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే