మిత్రుడ్ని చంపి మద్యం సేవిస్తూ రెండు రోజులు శవం పక్కనే...

Published : Mar 27, 2021, 10:13 AM IST
మిత్రుడ్ని చంపి మద్యం సేవిస్తూ రెండు రోజులు శవం పక్కనే...

సారాంశం

తనను చితకబాదాడనే కోపంతో ఓ వ్యక్తి తన మిత్రుడిని అత్యంత దారుణంగా చంపేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొందుగుల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

యాదాద్రి: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని రఘునాథపల్లిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారంనాడు ఆ హత్యకు సంబంధించిన వివరాలను జనగామ రూరల్ సీఐ బాలాజీ వరప్రసాద్ వివరించారు. చిన్న కారణంతో మిత్రుడే ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడు. 

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన అన్నెబోయిన భాస్కర్ (40), చందర్ రెడ్డి మిత్రులు. వారు కొద్ది రోజులుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. నెల క్రితం ఇరువురి మధ్య చిన్న కారణంతో గొడవ జరిగింది. దాంతో చందర్ రెడ్డిని భాస్కర్ తీవ్రంగా కొట్టాడు. 

దాంతో చందర్ రెడ్డి భాస్కర్ మీద కక్ష పెంచుకున్నాడు. భాస్కర్ ను హత్య చేయడానికి కుట్ర చేశాడు ఈ నెల 18వ తేదీ రాత్రి భాస్కర్ అతిగా మద్యం సేవించి చందర్ రెడ్డి ఇంట్లోనే నిద్రించాడు గాఢ నిద్రలో ఉన్న భాసకర్ మెడపై చందర్ రెడ్డి మూడు సార్లు నరికాడు. దాంతో భాస్కర్ మరణించాడు. 

ఆ తర్వాత రెండు రోజుల పాటు శవం పక్కనే మద్యం సేవిస్తూ నిద్రించసాగాడు. మూడో రోజు దుర్వాసన వస్తుండడంతో ఇంట్లో నుంచి పారిపోయి గ్రామ శివారులోని అడవుల్లో తలదాచుకున్నాడు. దుర్వాసన వస్తుండడంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు 

చందర్ రెడ్డిపై తనకు అనుమానం ఉందని భాస్కర్ సోదరుడు సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు సాగించారు తమకు అందిన సమాచారంతో శుక్రవారంనాడు పోలీసులు గ్రామ శివారులోని ఓ షెడ్డులో తలదాచుకున్న చందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

PREV
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu