కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నం: కామాంధుడికి మూడేళ్ల జైలు

By Siva KodatiFirst Published Apr 10, 2019, 8:39 AM IST
Highlights

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు. మూడేళ్ల పాటు సాగిన విచారణలో న్యాయస్థానం ఆ మృగాడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు. మూడేళ్ల పాటు సాగిన విచారణలో న్యాయస్థానం ఆ మృగాడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళితే...బాలాపూర్ మండలం జిల్లేలగూడకు చెందిన మహేందర్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన మహేందర్ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో 2016 అక్టోబర్‌ నెలలో తాగి వచ్చి భార్యతో వాగ్వాదానికి దిగాడు.

అనంతరం 13 ఏళ్ల తన కుమార్తెను వేరే గదిలోకి లాక్కెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కన్న తండ్రి తనతో అలా ప్రవర్తించటాన్ని జీర్ణించుకోలేని ఆ బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

వెంటనే తల్లి ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కూతురిని కాపాడుకుంది. భర్త వికృత చేష్టలపై భార్య అక్టోబర్ 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహేందర్‌పై ఐపీసీ 354 సెక్షన్ 21తో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అనంతరం పక్కా ఆధారాలతో మహేందర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గత మూడేళ్లుగా ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఎల్‌బి నగర్ మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు మంగళవారం మహేందర్‌ను దోషిగా నిర్థారించింది. ఇతనికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. 

click me!