విషాదం : ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తుండగా, తిరగబడ్డ ట్రాక్టర్.. యువకుడు మృతి

Siva Kodati |  
Published : May 16, 2023, 08:35 PM IST
విషాదం : ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తుండగా, తిరగబడ్డ ట్రాక్టర్.. యువకుడు మృతి

సారాంశం

పెద్దపల్లి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన రైతులు , స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సుల్తానాబాద్ మండలం చిన్నబంకూర్ గ్రామానికి చెందిన వరికిల సతీష్ అనే యువకుడు మంగళవారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తున్నాడు. అయితే మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన రైతులు , స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?