పీకలదాకా మద్యం తాగి... నిద్రలోనే..

Published : Feb 02, 2019, 07:30 AM IST
పీకలదాకా మద్యం తాగి... నిద్రలోనే..

సారాంశం

పీకలదాకా మద్యం తాగి.. ఆ మద్యం మత్తులో నిద్రలోనే ప్రాణాలు వదిలాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. 

పీకలదాకా మద్యం తాగి.. ఆ మద్యం మత్తులో నిద్రలోనే ప్రాణాలు వదిలాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సమతానగర్‌లో నివసిస్తున్న రాజ్‌కుమార్‌(39) ప్రైవేట్‌ ఉద్యోగి. బుధవారం మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. గురువారం ఉదయం లేవలేదు. భార్య స్వప్న పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకురమ్మని ఎంత లేపినా లేవకపోవడంతో నేరేడ్‌మెట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజ్‌కుమార్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయాడని నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరసింహస్వామి తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు  చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం