ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూత

Published : Jan 14, 2022, 08:10 PM ISTUpdated : Jan 14, 2022, 10:21 PM IST
ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూత

సారాంశం

ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి శుక్రవారం నాడు శివైక్యం పొందారు.ఉగాది పంచాంగ శ్రవణం, పురాణ ఇతిహసాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా ప్రవచనాలు చేసిన ఉభయ వేదాంత పండితులుగా  ఆయన పేరుగాంచారు. 

హైదరాబాద్‌: ప్రముఖ ప్రవచన కర్త malladi chandrasekhara sastry )  శుక్రవారం నాడు శివైక్యం చెందారు. ఆయన వయస్సు 96 ఏళ్లు.Ugadi పంచాంగ శ్రవణం, పురాణ ఇతిహసాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా ప్రవచనాలు చేసిన ఉభయ వేదాంత పండితులుగా  ఆయన పేరుగాంచారు. మల్లాది చంద్ర శేఖర శాస్త్రి  ys Rajasekhara Reddy ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాంగ శ్రవణం చేశారు. ఆలిండియా రేడియో,దూరదర్శన్‌లలో ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు. చంద్రశేఖర శాస్త్రి తెలుగు, సంస్కృత భాషల్లో మంచి ఘనాపాఠి.

1925 ఆగష్టు 23న గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రశేఖర శర్మ జన్మించారు.భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం సందర్భంగా చంద్రశేఖర శర్మ వ్యాఖ్యానం పలువురి మన్ననలు పొందాయి.భారతం, ధర్మసూక్ష దర్శనం, కృష్ణ లహరి, రామాయణ రహస్య దర్శిని తదితర గ్రంధాలను శర్మ రచించారు.వ్యాకరణ తర్క, వేదస్త సాహిత్యాలను ఆయన చదివారు. శనివారం నాడు  బన్సీలాల్ పేట హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్