మొజంజాహీ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం

Published : Apr 17, 2019, 12:30 PM IST
మొజంజాహీ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం

సారాంశం

హైద్రాబాద్‌లోని ఆబిడ్స్‌కు సమీపంలోని మొజంజాహీ మార్కెట్‌లో బుధవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అధికారులు వెంటనే ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్:  హైద్రాబాద్‌లోని ఆబిడ్స్‌కు సమీపంలోని మొజంజాహీ మార్కెట్‌లో బుధవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అధికారులు వెంటనే ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొజంజాహీ మార్కెట్‌లోని గోడౌన్‌లో  ఇవాళ మధ్యాహ్నం ఆకస్మాత్తుగా  మంటలు చేలరేగాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారమిచ్చారు.

ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గోడౌన్ల పక్కనే మరికొన్ని గోడౌన్లు ఉన్నాయి.పక్కనే ఉన్న గోడౌన్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

సిద్ధిపేట‌పై వ‌రాల జ‌ల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ. 544 కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు
సిద్ధిపేట‌లో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌.. ప్ర‌తీ కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌లు