పీకలదాకా తాగి.. బైక్ ని ఢీకొట్టిన బెంజ్ కారు

Published : Nov 13, 2020, 02:40 PM IST
పీకలదాకా తాగి.. బైక్ ని ఢీకొట్టిన బెంజ్ కారు

సారాంశం

మాదాపూర్ సిగ్నల్ టవర్ వద్ద ఓ బెంజ్ కారు సిగ్నల్ జంప్ చేసి వచ్చి మరీ.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతుల్లో గౌతమ్‌ దేవ్‌ (33) మృతి చెందగా, భార్య శ్వేతకు తీవ్ర గాయాలు అయ్యాయి.

పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. పబ్బులో పీకలదాకా మద్యం తాగి ఆ తర్వాత నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి.. బైక్ పై వెళుతున్న వారిని ఢీ కొట్టారు. ఈ క్రమంలో.. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన మాదాపూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మాదాపూర్ సిగ్నల్ టవర్ వద్ద ఓ బెంజ్ కారు సిగ్నల్ జంప్ చేసి వచ్చి మరీ.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతుల్లో గౌతమ్‌ దేవ్‌ (33) మృతి చెందగా, భార్య శ్వేతకు తీవ్ర గాయాలు అయ్యాయి. మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

ప్రమాదం జరిగిన సమయంలో కాశీ విశ్వనాథ్‌ అనే వ్యక్తి బెంజ్‌ కారును నడుపుతున్నారు. ఆయనతో పాటు మిత్రుడు కౌశిక్‌ కూడా ఉన్నాడు. కాగా కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశీ విశ్వనాథ్‌ను మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్