హైదరాబాద్ మెట్రో లిఫ్టుల్లో ‘‘ముద్దులు’’...వైరల్ అవుతోన్న వీడియోలు

Siva Kodati |  
Published : Feb 08, 2019, 07:54 AM IST
హైదరాబాద్ మెట్రో లిఫ్టుల్లో ‘‘ముద్దులు’’...వైరల్ అవుతోన్న వీడియోలు

సారాంశం

ప్రేమలో మునిగి తేలుతున్న ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు ఎవ్వరూ లేని ప్రాంతాలను వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వచ్చి చేరింది. నగరంలోని మియాపూర్-నాగోల్, మియాపూర్-ఎల్బీనగర్‌ మధ్య మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ అంతగా ఉండదు. దీంతో ఆ స్టేషన్‌లు ప్రేమికులకు అడ్డాగా మారాయి. 

ప్రేమలో మునిగి తేలుతున్న ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు ఎవ్వరూ లేని ప్రాంతాలను వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వచ్చి చేరింది. నగరంలోని మియాపూర్-నాగోల్, మియాపూర్-ఎల్బీనగర్‌ మధ్య మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.

అయితే వీటిలో కొన్ని స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ అంతగా ఉండదు. దీంతో ఆ స్టేషన్‌లు ప్రేమికులకు అడ్డాగా మారాయి. మహిళలు, వృద్ధులు, వికలాంగుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన లిఫ్టుల్లో ప్రేమికులు కామ కాలాపాలకు పాల్పడుతున్నారు.

ముద్దులతో పాటు హద్దు దాటే వారి దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. మెట్రో స్టేషన్‌లోని ప్రతి ప్రదేశం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ప్రయాణికుల కదలికలను ఉప్పల్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.

ఈ క్రమంలో ప్రేమికుల రాసలీలను గుర్తించిన అధికారులు ఏకాంతంగా ఉండే ప్రదేశాల్లో హుందాగా ఉండాలనే బోర్డులను ఏర్పాటు చేశారు. మరోవైపు సీసీ కెమెరాల్లో రికార్డు అయిని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవి బయటకి ఎలా వెళ్లాయి అనే దానిపై విచారణ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?