హిందూ అబ్బాయి.. ముస్లిం అమ్మాయి: ఒకే చెట్టుకు ప్రేమికుల ఉరి

Siva Kodati |  
Published : Feb 18, 2019, 11:10 AM IST
హిందూ అబ్బాయి.. ముస్లిం అమ్మాయి: ఒకే చెట్టుకు ప్రేమికుల ఉరి

సారాంశం

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమను పెద్దలు కాదనడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన ఎండీ పర్వీనా రామాయంపేటలో కుట్టు మిషన్‌ శిక్షణ నిమిత్తం వస్తోంది

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమను పెద్దలు కాదనడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన ఎండీ పర్వీనా రామాయంపేటలో కుట్టు మిషన్‌ శిక్షణ నిమిత్తం వస్తోంది.

ఈ క్రమంలో ఆమెకు అక్కడి కిరాణా దుకాణంలో పనిచేసే బాలేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలో వీరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు.

అయితే విషయం బాలేశ్ కుటుంబసభ్యులకు తెలియడం, వేర్వేరు మతాలు కావడంతో వారు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలేశ్, పర్వీనాలు కలిసే చావాలనుకున్నారు. ఒక రోజు ముందే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వీరు ఝాన్సీలింగాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.

రాత్రంతా అటవీ ప్రాంతంలోనే గడిపిన వీరు శనివారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!