బాబాయ్ వరుసయ్యే వ్యక్తితో ప్రేమ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. రైలుకిందపడి జంట ఆత్మహత్య....

Published : Dec 26, 2022, 01:07 PM IST
బాబాయ్ వరుసయ్యే వ్యక్తితో ప్రేమ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. రైలుకిందపడి జంట ఆత్మహత్య....

సారాంశం

వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో ప్రేమలో పడిందో యువతి.. అయితే విషయం తెలిసి ఇంట్లో వాళ్లు... వారి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో రైలు పట్టాల కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

నారాయణ పేట : నారాయణ పేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించుకున్న ఓ జంట తీరా పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి వారి వరుసలు కలలవవని తెలిసింది. వారిద్దరూ వరుసకు బాబాయ్, కూతుర్లు అవుతుండడంతో ఏం చేయాలో దిక్కు తోచలేదు. అది తెలిసి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. దీంతో మనస్తాపానికి గురయ్యారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటన తెలంగాణలోని నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం చేగుంటలో ఆదివారం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కందానాటికి చెందిన మునికుమార్ (25), పారుపల్లి గ్రామానికి చెందిన అనిత (16) ప్రేమించుకున్నారు. వీరి కుటుంబాలు కొంతకాలం క్రితం బతుకు దెరువుకోసం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం, చేగుంటలో పత్తి పొలాల్లో పత్తి తీయడానికి వలస వచ్చారు. 

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం మృతి

అలా వచ్చిన కుటుంబాలు.. పత్తి చేలకు దగ్గర్లోనే గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. అయితే, ఇలా ఒకదగ్గర ఉండే క్రమంలో అనిత, మునికుమార్ ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ సమయంలో వీరిద్దరికీ వరుసలు తెలుసో, లేదో.. తెలియదు కానీ.. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసిన తరువాత మాత్రం.. బాబాయ్ వరుస అవుతాడని తేలింది. దీంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. వరుసలు కలవకపోవడం, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇక తాము కలిసి ఉండడం కుదరదని తెలిసి మనస్థాపానికి గురయ్యారు. 

ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇద్దరు కలిసి ఇంట్లోనుంచి బయటికి వచ్చారు. రైలు పట్టాల దగ్గరికి వెళ్లి.. రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రెగ్యులర్ చెకప్స్ లో భాగంగా.. పట్టాలు తనిఖీ చేస్తున్న రైల్వే గ్యాంగ్ మెన్ వీరి మృతదేహాలను గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. ఆ తరువాత పోస్టుమార్టం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu