లాక్‌డౌన్ ఎఫెక్ట్: మద్యం లేక కల్లుకు డిమాండ్... తాటి వనాల్లో రష్

By Siva Kodati  |  First Published Apr 20, 2020, 8:22 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా అందరి బాధా ఒకటైతే.. మందుబాబుల ఆవేదన మరొకటి. మద్యం చుక్క దొరక్క వీరంతా పిచ్చెక్కిపోతున్నారు.


కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా అందరి బాధా ఒకటైతే.. మందుబాబుల ఆవేదన మరొకటి. మద్యం చుక్క దొరక్క వీరంతా పిచ్చెక్కిపోతున్నారు.

ఈ క్రమంలో పెట్రోల్, కిరోసిన్, సేవింగ్ క్రీమ్, శానిటైజర్‌ లాంటి రసాయనాలను తాగేసి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అయితే మద్యం తాగాలని ఉవ్విళ్లూరుతున్న వారికి కల్లు వరంలా మారింది.

Latest Videos

undefined

Also Read:18 ఏళ్ల కిందట చంద్రబాబు కట్టించారు: ఇప్పుడు తెలంగాణకు అక్కరొచ్చింది

దీంతో పట్నం, పల్లె అన్న తేడా లేకుండా మందు బాబులంతా తాటి వనాల బాట పడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా మధ్యాహ్నం వరకే బయట తిరిగే వెసులుబాటు ఉండటంతో కల్లు కొనుక్కుని ఇళ్లకు చేరిపోతున్నారు.

మద్యంతో పోల్చుకుంటే తక్కువ ధరకే కల్లు లభ్యం అవుతుండటం, ఆరోగ్యానికి మంచిది కావడంతో పలువురు కల్లు కాంపౌండ్లకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తాటి వనాలు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు మందు బాబులతో కిటకిటలాడుతున్నాయి.

లాక్ డౌన్ కారణంగా తాటి కల్లుకు డిమాండ్ రావడంతో గీత కార్మికులకు ఆదాయం కూడా పెరిగిందని చెప్పాలి. గతంలో రోజుకు రూ.300 నుంచి 400 కూడా సంపాదించే వారు నేడు 1,000 నుంచి 1,500 రూపాయల వరకు సంపాదిస్తున్నారు.  

Also Read:ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడానికి వీల్లేదు: కేటీఆర్ వార్నింగ్

ఆదివారం అయితే మరింత డిమాండ్ ఎక్కువగానే ఉందని చెప్తున్నారు కల్లు గీత కార్మికులు. అయితే లాక్‌డౌన్ కారణంగా డిమాండ్ ఉన్నప్పటికీ కల్లు గీత కార్మికులు ధరలు పెంచకపోవడం గమనార్హం. గతంలో అమ్మినట్లుగానే లీటర్ కల్లు ధర రూ.50 చొప్పునే విక్రయిస్తుండటం వారిలోని నిజాయితీకి నిదర్శనం.

ఇంత డిమాండ్ ఉన్నా ఇంకా తమ చెరువు గట్టు సమీపంలోని చాలా చెట్ల నుంచి కల్లు తీయడం లేదని, కొద్దిపాటి చెట్ల నుంచి మాత్రమే కల్లు తీస్తున్నట్లు కల్లు గీత కార్మికులు చెబుతున్నారు. 

click me!