నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు: మద్యం అమ్మకాలపై నిషేధం, ట్రాఫిక్ ఆంక్షలు

By Siva KodatiFirst Published Sep 10, 2019, 1:59 PM IST
Highlights

ఈ నెల 12వ తేదీ జరగనున్న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు

ఈ నెల 12వ తేదీ జరగనున్న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

21 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. అలాగే గణేశ్ మండపాల దగ్గర, శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో డీజేకు అనుమతి లేదని తెలిపారు.

అలాగే శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.

నిమజ్జనాన్ని తిలకించడానికి వచ్చే వారి కోసం ఖైరతాబాద్ ఇంజనీర్స్ ఇనిస్టిట్యూట్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఖైరతాబాద్ ఎంఎంటీస్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్ వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రవాణా వాహనాలకు 12వ తేదీ అర్థరాత్రి నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు హైదరాబాద్‌లోకి అనుమతి లేదన్నారు. శోభాయాత్ర సందర్భంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 040-27852482, 9490598985, 9010203626 నెంబర్లను సంప్రదించవచ్చని అంజనీకుమార్ తెలిపారు

 

click me!