ఫాస్టాగ్ పట్టించింది.. బంధువులతో మాట్లాడతానని.. కోర్టు ఆవరణ నుంచి జీవితఖైదీ పరార్..

Published : May 07, 2022, 07:54 AM IST
ఫాస్టాగ్ పట్టించింది.. బంధువులతో మాట్లాడతానని.. కోర్టు ఆవరణ నుంచి జీవితఖైదీ పరార్..

సారాంశం

ఓ జీవితఖైదీ అతి తెలివి చూపించబోయాడు. అయితే పోలీసుల చాకచక్యంముందు అడ్డంగా దొరికిపోయాడు. మరో కేసులో బుక్కయ్యాడు. కోర్టు ఆవరణ నుంచి మెరుపువేగంతో పారిపోయి...ఫాస్టాగ్ తో పట్టుబడిపోయాడు. 

మిర్యాలగూడ : Nalgonda District మిర్యాలగూడ న్యాయస్థానం ఆవరణ... చర్లపల్లి జైలు నుంచి ఒక Life prisonerని వేరొక కేసులో విచారణ కోసం పోలీసులు Courtకు తీసుకొచ్చారు. జైలులో పరిచయమైన మరొక ఖైదీ బంధువులను ముందే అక్కడికి రప్పించిన ముద్దాయి వారి car తీసుకుని అక్కడి నుంచి హఠాత్తుగా పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్ దిశగా పారిపోయిన అతడిని పోలీసులు Fastag ఆధారంగా గుర్తించారు.  ఎట్టకేలకు అర్ధరాత్రి దాటాక ఏపీలోని ప్రకాశం జిల్లాలో పట్టుకోగలిగారు.  మిర్యాలగూడ ఒకటో పట్టణ సీఐ మండవ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా  పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నవులూరు గ్రామానికి చెందిన రవిశంకర్ (46) పై తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా కేసులు ఉన్నాయి.

హైదరాబాద్లోని హయత్నగర్లో 2019 లో జరిగిన కిడ్నాప్, అత్యాచారం కేసులో రవిశంకర్ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మరో ఖైదీ  శ్రీధర్ తో mulakat వచ్చిన అతడి బంధువులతో రవిశంకర్ పరిచయం చేసుకున్నాడు. మే నెల 5న మిర్యాలగూడ కోర్టుకు వస్తానని, ఆరోజు అక్కడికి రావాలని వారిని కోరాడు. గురువారం ఉదయం రవిశంకర్ ను అంబర్పేట హెడ్ కోటర్స్ కు చెందిన రిజర్వు పోలీసులు మిర్యాలగూడ తీసుకువచ్చారు. కోర్టులో ప్రక్రియ ముగిసేసరికి సాయంత్రం అయ్యింది. అక్కడికి వచ్చిన తన మిత్రులతో మాట్లాడతానని రవిశంకర్ పోలీసులను కోరారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న బంధువులతో మాట్లాడసాగాడు. పక్కనే వారి కారు (టీఎస్ 08జీఎల్ 8818) ఉండగా, రవిశంకర్ తన పథకం అమలుకు సిద్ధమయ్యాడు.

కారు తాళలు ఇగ్నీషన్ కు వదిలేసి ఉండటంతో అతడి పని సులువయింది. ఒక్క ఉదుటున కారెక్కి వేగంగా కారును పరిగెత్తించాడు. అద్దంకి రహదారి దిశగా దూసుకుపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో నివ్వెరపోయిన రిజర్వు పోలీసులు స్థానిక పోలీసులకు తెలిపారు. మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు తన సిబ్బందితో రంగంలోకి దిగారు. డ్రైవర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఖైదీ గురజాల వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. కాసేపటికి ఆ ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఫాస్టాగ్ ఆధారంగా ప్రయత్నించారు.

అందులో డబ్బులు నిలువ లేకపోవడంతో అప్పటికప్పుడు రీఛార్జి చేయించి కారు వెళ్లే మార్గాన్ని అనుసరించారు. నల్గొండ జిల్లా పోలీసు కంట్రోల్ రూం నుంచి ప్రకాశం జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఒంగోలు జాతీయ రహదారిపై గస్తీ నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మల్లూరు ప్రాంతం వద్ద కారులో వస్తున్న రవిశంకర్ ను గుర్తించారు.  దాదాపు ఏడు కిలోమీటర్లు వెంబడించి టంగుటూరు టోల్ గేట్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా పోలీసులు అతడిని శుక్రవారం ఉదయం మిర్యాలగూడ తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచారు. 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu