హెటిరో ల్యాబ్స్‌లో చిరుత కలకలం.. భయాందోళనలో ఉద్యోగులు..

Published : Dec 17, 2022, 10:24 AM IST
హెటిరో ల్యాబ్స్‌లో చిరుత కలకలం.. భయాందోళనలో ఉద్యోగులు..

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్స్‌లో చిరుత సంచరిస్తుంది.  

సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్స్‌లో చిరుత సంచరిస్తుంది.శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చిరుత హెటిరో పరిశ్రమలోకి ప్రవేశించింది. హెటిరో ల్యాబ్‌లో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హెటిరో పరిశ్రమలోని హెల్ బ్లాక్‌లో చిరుత దాక్కున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది హెటిరో పరిశ్రమకు చేరుకుని చిరుత కోసం గాలింపు చేపట్టారు. 

చిరుతను బంధించేందు జిల్లా అటవీ అధికారి శ్రీధర్‌ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుంది. చిరుతను బంధించేందుకు బోన్ ఏర్పాటు చేశారు. ఇక, కొన్ని నెలల క్రితం కూడా చిరుత హెటిరో పరిశ్రమలో సంచరించింది. ఆ సమయంలో కూడా చిరుతకు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయింది.
 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే