పొలం దున్నుతుండగా దొరికిన లంకెబిందెలు.. సమానంగా పంచిన హోంగార్డు..

Published : Jul 12, 2021, 11:11 AM IST
పొలం దున్నుతుండగా దొరికిన లంకెబిందెలు.. సమానంగా పంచిన హోంగార్డు..

సారాంశం

గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆ భూమిలో ఇటీవల ట్రాక్టర్ తో దున్నుతుండగా ట్రాక్టర్‌ నాగళ్లకు బిందె తగిలింది. దాంట్లో కిలోకి పైగా బంగారం ఉన్నట్లు సమాచారం. 

సూర్యాపేట జిల్లాలో లంకె బిందె దొరకడం కలకలం రేపుతోంది. చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామంలోని ఓ వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ తో దున్నుతుండగా లంకె బిందె లభించినట్లు తెలుస్తోంది.  

విశ్వసనీయ సమాచారం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆ భూమిలో ఇటీవల ట్రాక్టర్ తో దున్నుతుండగా ట్రాక్టర్‌ నాగళ్లకు బిందె తగిలింది. దాంట్లో కిలోకి పైగా బంగారం ఉన్నట్లు సమాచారం. 

 ఆ సమయంలో ట్రాక్టర్‌ దున్నే వ్యక్తి తో గ్రామానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. బంగారం పంపకాలలో వివాదం తలెత్తినట్లుగా సమాచారం.  దీంతో ఇది కాస్త ఓ హోంగార్డు వద్దకు చేరింది. 

హైదరాబాదులో పనిచేస్తున్న హోంగార్డు ఆ సమస్యను చాలా ఈజీగా పరిష్కరించినట్లు గా తెలుస్తోంది.  అతని మధ్యవర్తిత్వంలో పంపకాలు జరిగినట్లు తెలిసింది.  

ఈ ముగ్గురిలో ఇద్దరికి రూ. పది లక్షలు, మరొకరికి రూ. 14 లక్షలు ఇచ్చి మిగతా బంగారం మరో వ్యక్తి, సదరు హోంగార్డు అమ్ముకునేలా నిర్ణయించుకున్నారని గ్రామస్తులు అనుకుంటున్నారు.  ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు తెలిసే ఈ నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం