రూ.24వేల కోట్లు రికమండ్ చేస్తే రూ.24 కూడా ఇవ్వలేదు:నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ ట్వీట్

By Nagaraju penumalaFirst Published Jul 6, 2019, 2:45 PM IST
Highlights


మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ స్కీమ్‌లను నీతి ఆయోగ్‌ ప్రశంసించిందని గుర్తు చేశారు. ఆ రెండు ప్రాజెక్టులకు రూ.24వేల కోట్లను కేటాయించాలని నీతి ఆయోగ్‌ రికమెండ్‌ చేస్తే కనీసం రూ.24 కూడా కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం లేదా పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ చేస్తూనే ఉందని కానీ తమ విన్నపాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 

హైదరాబాద్‌ : కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశజనకంగా ఉందంటూ ఆరోపించారు. 

కేంద్ర బడ్జెట్‌ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఎకనామిక్‌ సర్వే తెలంగాణ రాష్ట్ర చర్యలను ప్రశంసిస్తూ ప్రత్యేక సాయం అందించాలన్న వినతులను పట్టించుకోలేదంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ట్వీట్ చేశారు.  

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ స్కీమ్‌లను నీతి ఆయోగ్‌ ప్రశంసించిందని గుర్తు చేశారు. ఆ రెండు ప్రాజెక్టులకు రూ.24వేల కోట్లను కేటాయించాలని నీతి ఆయోగ్‌ రికమెండ్‌ చేస్తే కనీసం రూ.24 కూడా కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. 

కాళేశ్వరం లేదా పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ చేస్తూనే ఉందని కానీ తమ విన్నపాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని అభఇప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు పూర్తికావడచ్చినా ఇప్పటికీ విభజనచట్టంలోని హామీలను అమలు చేయలేదని కేటీఆర్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 

Even after 5 years of formation of Telangana, no mention of the AP Bifurcation Act promises; integrated steel plant at Bayyaram, Rail Coach factory at Warangal, Tribal University etc

Why this indifference to a promising young state FM Ji? 👎

— KTR (@KTRTRS)

 

click me!