కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం

By narsimha lodeFirst Published Dec 18, 2018, 8:49 PM IST
Highlights

 ఎమ్మెల్సీ పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం నాడు  రాజీనామా చేశారు.


హైదరాబాద్: ఎమ్మెల్సీ పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం నాడు  రాజీనామా చేశారు. ఈ రాజీనామాను శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ ఆమోదించారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో  మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా విజయం సాధించినందున ఎమ్మెల్సీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థిపై ఛాలెంజ్ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో  నల్గొండ నుండి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. అన్న ఓటమిపాలైన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. త్వరలోనే నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

click me!