రేవంత్ రెడ్డికి షాక్....కొడంగల్‌లో టీజెఎస్ మద్దతు టీఆర్ఎస్‌కే (వీడియో)

Published : Nov 30, 2018, 08:48 PM IST
రేవంత్ రెడ్డికి షాక్....కొడంగల్‌లో టీజెఎస్ మద్దతు టీఆర్ఎస్‌కే (వీడియో)

సారాంశం

తెలంగాణలో టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో కొడంగల్ అతి ముఖ్యమైంది. ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తుంటే...వారికి తన గెలుపుతోనే సమాధానం చెప్పాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మంత్రి మహేందర్ రెడ్డి తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డిని రేవంత్ పై పోటీకి దించింది. 

ఇద్దరు బలమైన నాయకుల పోటీతో కొడంగల్ రసవత్తరంగా మారింది. అక్కడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రజల మద్దతు తనకే వుందని గెలుపు ధీమాతో వున్న రేవంత్ కు ప్రజా కూటమిలోని బాగస్వామ్య పక్షంనుండి భారీ షాక్ తగిలింది. కొడంగల్ నియోజక వర్గంలో మహా కూటమి‌ నుండి బయటకు వచ్చిన జన సమితి కొందరు నాయకులు టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు తెలిపారు.  దీంతో కొడంగల్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

మహా కూటమిలో తమకు సరైన గౌరవం లేకపోవడం వల్లే అందులోంచి బైటికి వచ్చి టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు టీజెఎస్ నాయకులు ప్రకటించారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఎంతో కష్టపడి టీజేఎస్ ను బలపరిస్తే తమకు కూటమి అభ్యర్థి సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. అంందువల్లే నరేందర్ రెడ్డి పక్షాన నిలుస్తున్నామని....టీజెఎస్ కార్యకర్తలందరు ఆయనకే మద్దతివ్వాలని సూచించారు.

వీడియో

"

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu