స్వీట్, కైట్ ఫెస్టివల్ కు పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబు

Published : Jan 12, 2019, 08:22 PM IST
స్వీట్, కైట్ ఫెస్టివల్ కు పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబు

సారాంశం

స్వీట్ ఫెస్టివల్ లో 22 దేశాల మహిళా హోమ్ మేకర్స్, 25 రాష్ట్రాలకు చెందిన 2500 మంది హోమ్ మేకర్స్ తయారు చేసిన 1200 రకాల స్వీట్ వెరైటీల స్వీట్స్ ను 1200 స్టాల్స్ ద్వారా ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు జరుపుతారు.  

హైదరాబాద్: నాలుగవ అంతర్జాతీయ కైట్ అండ్ 2వ స్వీట్ ఫెస్టివల్ లో 20 దేశాల నుండి 42 మంది అంతర్జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్స్ సభ్యులు పాల్గొంటున్నారు,ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు అనుబంధంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ ను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు.

ఈ స్వీట్ ఫెస్టివల్ లో 22 దేశాల మహిళా హోమ్ మేకర్స్, 25 రాష్ట్రాలకు చెందిన 2500 మంది హోమ్ మేకర్స్ తయారు చేసిన 1200 రకాల స్వీట్ వెరైటీల స్వీట్స్ ను 1200 స్టాల్స్ ద్వారా ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు జరుపుతారు. జనవరి 13 నుండి15 వరకు సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో జరిగే ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ లో నిరంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.


ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రముఖ గాయకుడు రామాచారి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు, సంగీత విభావరి జరుగుతాయి.సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో  కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు.సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు 25 రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు.

మూడు రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.ఈ ఫుడ్ ఫెస్టివల్ ను ఆహ్లాదకరమైన వాతావరణం లో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఫుడ్ ను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని పరేడ్ మైదానం లో హ్యాండి క్రాఫ్ట్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్